Kamran Akmal : క్షమాపణలు కోరిన పాక్ మాజీ క్రికెటర్

Kamran Akmal : క్షమాపణలు కోరిన పాక్ మాజీ క్రికెటర్
X

సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ( Kamran Akmal ) క్షమాపణలు చెప్పారు. ‘నా కామెంట్స్ పట్ల తీవ్రంగా చింతిస్తున్నాను. హర్భజన్ సింగ్‌తో పాటు సిక్కులందరినీ క్షమాపణ కోరుతున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. ఎవరినీ కించపరచడం నా ఉద్దేశం కాదు. దయచేసి నన్ను క్షమించండి’ అని ఆయన ట్వీట్ చేశారు.

న్యూయార్క్‌లోని నసావు కౌంటీ వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. ఓ న్యూస్ ఛానెల్ డిబేట్‌లో కమ్రాన్ అక్మల్ పాల్గొన్నాడు. చివరి ఓవర్‌లో పాక్ జట్టు 18 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు.. అర్ష్‌దీప్ బౌలింగ్‌కు దిగాడు. అప్పుడు కమ్రాన్ అతని మతాన్ని ఉద్దేశిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో.. అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. వృత్తిపరంగా సెటైర్లు వేస్తే పర్లేదు కానీ.. ఇలా జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం తగదంటూ అతనిపై ఎగబడ్డారు. హర్భజన్ సింగ్ కూడా దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు.

‘అర్ధరాత్రి 12 గంటలకు ఏ సిక్కుకూ బౌలింగ్ ఇవ్వరాదు’ అని పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలకు హర్బజన్ ట్విట్టర్ లో కౌంటరిచ్చారు. ‘నీ చెత్త నోరు విప్పడానికి ముందు సిక్కుల చరిత్ర తెలుసుకో. అర్ధరాత్రి 12 గంటలకు ఆక్రమణదారులు మీ తల్లులు, సోదరీమణులను అపహరించినప్పుడు మేమే రక్షించాం. కృతజ్ఞతతో ఉండండి’ అని పోస్టు చేశారు. అర్ష్‌దీప్‌ను ఉద్దేశించి సిక్కులను నమ్మొద్దనే అర్థంలో అక్మల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags

Next Story