IPL 2024 : అరంగేట్ర మ్యాచులోనే మెక్‌గుర్క్ రికార్డు

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ మెక్‌గుర్క్ రికార్డు సృష్టించారు. అరంగేట్ర మ్యాచులో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోర్ చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచారు. నిన్న LSGతో జరిగిన మ్యాచులో అతను 55 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలో చెన్నై మాజీ ప్లేయర్ మైఖేల్ హస్సీ (116*) తొలి స్థానంలో ఉన్నారు. 2008 సీజన్‌లో ఆయన తొలి మ్యాచ్ ఆడారు.
22 ఏళ్ల మెక్‌గుర్క్.. ఆస్ట్రేలియా ప్లేయర్. ఏప్రిల్ 11, 2002న ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జన్మించాడు. మెక్‌గుర్క్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో విక్టోరియా జట్టు తరఫున ఆడుతున్నాడు. 2019లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు, లిస్ట్-ఏ క్రికెట్‌లోకి కూడా అడుగుపెట్టాడు. తన ప్రదర్శనతో బిగ్‌బాష్ లీగ్‌లో సైతం ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాష్ లీగ్-2020 సీజన్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరపున డెబ్యూ చేశాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 37 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆసీస్ ప్లేయర్.. 645 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 550 రన్స్, లిస్ట్-ఏ క్రికెట్‌లో 525 పరుగులు మెక్‌గుర్క్ ఖాతాలో ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com