Ganguly : రోహిత్ శర్మను కెప్టెన్ చేసిందే నేను.. గంగూలీ హాట్ కామెంట్స్
టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా విజేతగా నిలవడంతో దేశమంతా సంబరాలు చేసుకున్నారని, రోహిత్ శర్మను కెప్టెన్ గా చేసిన తనను మాత్రం అందరూ మర్చిపోయారని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. రోహిత్ ను కెప్టెన్ గా నియమించినప్పుడు తనను చాలా మంది విమర్శించారని, అతని సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్ గెలిస్తే మాత్రం ఎవరూ తనను గుర్తించడం లేదని తెలిపాడు.
టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియా ఘోర పరాజయం అనంతరం పొట్టి ఫార్మాట్ సారథ్యానికి విరాట్ కోహ్లి గుడ్ బై చెప్పగా... వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా అతన్ని బీసీసీఐ తప్పించింది. అప్పట్లో ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగింది. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని విరాట్ కోహ్లి మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై మండిపడ్డాడు.
విరాట్ కోహ్లిని ఒప్పించే ఈ నిర్ణయం తీసుకున్నానని సౌరవ్ గంగూలీ మీడియాకు చెప్పారు. ఐతే.. విరాట్ కోహ్లి అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఉద్దేశ పూర్వకంగానే విరాట్ కోహ్లిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించారనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. ఈ వ్యవహారంతో ఇప్పటి వరకు సౌరవ్ గంగూలీ, కోహ్లీ మధ్య మాటలు లేవు. ఐతే.. తాజాగా రోహిత్ శర్మను కెప్టెన్ చేసింది తానేనని గంగూలీ చెప్పడం వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com