Team India Head Coach : గంభీర్ వస్తున్నాడు.. టీమిండియా హెడ్ కోచ్‌ బాధ్యతలు అప్పగింత!

Team India Head Coach : గంభీర్ వస్తున్నాడు.. టీమిండియా హెడ్ కోచ్‌ బాధ్యతలు అప్పగింత!

టీమిండియా మెన్స్ క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ) ఎంపిక దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. దీనిపై ఈ నెల ఆఖరులోగా బీసీసీఐ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచకప్ తో ముగియనుంది.

అయితే జూలై 1 నుంచి టీమిండియా కొత్త కోచ్ బాధ్యతలను గంభీర్ స్వీకరించే చాన్స్ ఉంది. ఈ పదవి కోసం రికీ పాంటింగ్, స్టీవెన్ ఫ్లెమింగ్, జయవర్ధనే, జస్టిన్ లాంగర్ వంటి దిగ్గజాలు పోటీపడినా.. బీసీసీఐ మాత్రం గంభీర్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు వెళ్లనుంది. జులై 6 నుంచి 14 వరకు జరిగే జంబాబ్వే పర్యటనలో భారత్ 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. జింబాబ్వే సిరీస్ తో గంభీర్ కొత్త కోచ్ బాధ్యతలు చేపట్టే చాన్సుంది.

Tags

Next Story