IPL 2024 : దడ పుట్టించిన గుజరాత్.. పంజాబ్ విలవిల

ఐపీఎల్ మ్యాచ్ జోరుగా సాగుతోంది. ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. గుజరాత్‌కు ఇది నాలుగో విజయం కాగా.. పంజాబ్‌కు ఆరో ఓటమి ఎదురైంది.
పంజాబ్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి సాధించింది. జట్టు తరపున రాహుల్ తెవాటియా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 17 బంతుల్లో 32 పరుగులు చేశాడు. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 35 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు, లివింగ్‌స్టన్ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటైంది.
పంజాబ్ జట్టు తరఫున ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అత్యధికంగా 35 పరుగులు చేశాడు. చివర్లో స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ 29 పరుగులు చేశాడు. బౌలింగ్ లో గుజరాత్ తరఫున సాయి కిషోర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ ఒకటి, నూర్ అహ్మద్ రెండు వికెట్లు చొప్పున తీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com