IPL 2024 : గుజరాత్ టైటాన్స్ చెత్త రికార్డు

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 89 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే గుజరాత్ తమ అత్యల్ప స్కోరు నమోదు చేసి అప్రతిష్ఠపాలైంది. ఇంతకుముందు గుజరాత్ అత్యల్పస్కోరు 125/6గా ఉంది. కాగా ఆ జట్టు 100 పరుగులలోపు ఆలౌట్ కావడం కూడా ఇదే తొలిసారి.
టీంల వారీగా అత్యల్ప స్కోర్లు
49- ఆర్సీబీ vs కేకేఆర్
58- రాజస్థాన్ vs ఆర్సీబీ
66- ఢిల్లీ vs ముంబై
67- కేకేఆర్ vs ముంబై
73- పంజాబ్ vs పుణె
79- చెన్నై vs ముంబై
82- లక్నో vs గుజరాత్ టైటాన్స్
87- ముంబై vs SRH
89- గుజరాత్ vs ఢిల్లీ
96- SRH vs ముంబై
మరోవైపు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చరిత్ర సృష్టించింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో 67 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. దీంతో 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా ఢిల్లీకి ఇదే అతి పెద్ద విజయం. అంతకుముందు 2022లో పంజాబ్ కింగ్స్‌పై 57 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. అలాగే ఈ సీజన్‌లో బంతులపరంగా అతి పెద్ద విజయంగా ఢిల్లీ రికార్డు నమోదు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com