Hanuma Vihari : హనుమా విహారీ సంచలన నిర్ణయం .. ఆంధ్ర జట్టుకు గుడ్ బై

Hanuma Vihari : హనుమా విహారీ సంచలన నిర్ణయం ..  ఆంధ్ర జట్టుకు గుడ్ బై

Andhra Cricket : ఆంధ్ర క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హనుమా విహారీ (Hanuma Vihari) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై ఆంధ్ర జట్టుకు ఆడబోనని విహారి సోమవారం సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఏపీ క్రికెట్ అసోసియేషన్లో రాజకీయ నేతల ప్రమేయం ఉందని ఆరోపించాడు. అందుకే తాను ఆంధ్ర జట్టుతో విడిపోతున్నట్లు విహారి తన పోస్టులో పేర్కొన్నాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్ లో జట్టులోని 17వ ఆటగాడిపై ఆటపరంగా అరిచాను. వ్యక్తిగతంగా అతనిపై ఎలాంటి విభేధం లేదు.

అయితే ఆ ప్లేయర్ తండ్రి రాజకీయ నాయకుడు. అతని జోక్యంతో జట్టు మేనేజ్మెంట్ తనని కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఇది చాలా బాధకరమైన విషయం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తన ఆత్మగౌరవం దెబ్బ తీసింది. అందుకే తాను ఇకపై ఆంధ్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించనని విహారి తన పోస్టులో వివరించాడు. కాగా టీమిండియా తరఫున 16 టెస్టులు ఆడిన అంతర్జాతీయ క్రికెటర్ హనుమా విహారి 37 ఫస్ట్స్ మ్యాచ్లలో ఆంధ్ర జట్టు ప్రాతినిథ్యం వహించాడు. విహారి సారథ్యంలో ఆంధ్ర 5 సార్లు నకౌటకు చేరింది.

మరోవైపు హనుమ విహారిని కెప్టెన్‌గా తొలగించిన తర్వాత.. కె.ఎన్‌.పృథ్వీరాజ్‌ మినహా జట్టులోని మిగతా 15 మంది సభ్యులూ ఏసీఏ పెద్దలకు ఒక లేఖ రాశారు. విహారి తప్పేమీ లేదని, ఆయననే కెప్టెన్‌గా కొనసాగించాలని కోరారు. వారిలో విహారి తర్వాత కెప్టెన్‌గా నియమితుడైన రికీభుయ్‌ కూడా ఉండటం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story