Hardik Pandya : ఓటమి ఊహించలేదు... హార్దిక్ పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు
నిన్నటి మ్యాచులో రాజస్థాన్ (Rajasthan Royals) చేతిలో ఓటమిపై ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మ్యాచులో ఈ ఫలితాన్ని ఊహించలేదని చెప్పారు. కోరుకున్న విధంగా ఆరంభం దక్కలేదన్నారు. రాబోయే మ్యాచుల్లో ఉత్తమ ప్రదర్శన ఇవ్వగలమనే నమ్మకం ఉందన్నారు. దీని కోసం ధైర్యంగా ఆడాల్సి ఉంటుందన్నారు.
ఐపీఎల్‌లో ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన హార్దిక్ పాండ్య ఇంకా విజయాల ఖాతా తెరవలేదు. గుజరాత్ కెప్టెన్‌గా తొలి మూడు మ్యాచుల్లో విజయాన్ని అందుకున్న ఈ ఆల్‌రౌండర్.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మాత్రం విఫలమవుతున్నారు. మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో హార్దిక్ ఫెయిల్ అవడం, ఆటగాళ్ల మధ్య సమన్వయం కల్పించడంలో విఫలమవ్వడం వంటివి ముంబై పరాజయాలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే వరుస ఓటములతో డీలాపడ్డ ముంబైని చెత్త రికార్డులు వెంటాడుతున్నాయి. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన MI కేవలం 125 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈ సీజన్‌లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 15.3ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. అంతకుముందు చెన్నైతో మ్యాచ్‌లో గుజరాత్ 143/8 నమోదు చేసింది. దాన్ని ముంబై చెరిపేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com