Mumbai Indians : ఢిల్లీతో మ్యాచ్ లో అందుకే బౌలింగ్ చేయలేదు- పాండ్యా

మునుపెన్నడూ లేని రీతిలో ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తొలి విజయం నమోదుచేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి విజయాన్ని అందుకుంది. ప్రతి మ్యాచ్ లో బౌలింగ్ చేసే హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో ఒక్క ఓవర్ ఒక్క ఓవర్ కూడా వేయలేదు. హార్దిక్ పాండ్యా ఎందుకు బౌలింగ్ వేయలేదనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
విమర్శలు పక్కన పెట్టి తొలి రెండు మ్యాచ్ లలో బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా భారీగా పరుగులిచ్చుకున్నాడు. అందుకే నాలుగో మ్యాచ్ లో బౌలింగ్ చేయలేదని తెలుస్తోంది. దీనిపై హార్దిక్ కూడా స్పందించాడు. తాను టైం కుదిరినప్పుడు మళ్లీ బౌలింగ్ చేస్తానని చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ పొరపాట్లను సరిచేసుకున్నామన్నాడు. తనకు బౌలింగ్ చేసే అవసరం రాలేదన్నాడు. మున్ముందు మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమాగా చెప్పాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ పై (Delhi Capitals) సమష్టిగా ఆడిన ముంబై ఇండియన్స్.. 29 రన్స్ తేడాతో గెలుపొందింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com