Mumbai Indians : హార్దిక్ పాండ్యాపై ద్వేషం మామూలుగా లేదుగా..!

Mumbai Indians : హార్దిక్ పాండ్యాపై ద్వేషం మామూలుగా లేదుగా..!

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఒక ఆటగాడు, కెప్టెన్ పై అభిమానులు ఆగ్రహం విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభం కంటే ముందే గుజరాత్ జట్టు నుంచి ట్రేడింగ్ పద్ధతిలో ముంబై జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా (Hardik Pandya) వచ్చాడు. అప్పటినుంచి అతనిపై ఆగ్రహం అభిమానులకు తారాస్థాయికి చేరింది.

వాస్తవానికి హార్దిక్ పాండ్యా మంచి ఆటగాడు. ఎంట్రీ సీజన్ లోనే గుజరాత్ జట్టును విజేతగా నిలిపాడు. గత సీజన్ లో రన్నరప్ ను చేశాడు. అలాంటి హార్దిక్ ప్రస్తుతం ముంబై జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ఆదివారం గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ నేతృత్వంలోని ముంబై జట్టు ఓడిపోయింది. దీంతో విమర్శలు తీవ్రమయ్యాయి.

రోహిత్ శర్మ కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంతో.. అభిమానులు చాలామంది అతనిపై వ్యతిరేకత పెంచుకున్నారు. “పాండ్యా సీనియర్లకు గౌరవం ఇవ్వరు. అతడికి అతి విశ్వాసం ఎక్కువ. గాయాల పేరుతో అంతర్జాతీయ మ్యాచులు ఆడడు. కానీ ఐపీఎల్ సమయానికి ఫిట్ అవుతాడని” అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. అభిమానులు తనపై ఈ స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం పట్ల అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆటగాళ్లు ఆట మాత్రమే ఆడతారని.. ఇందులో ఆట తీరు మాత్రమే చూడాలని.. వ్యక్తిగతంగా కక్షలు పెంచుకుంటే.. అన్ని లోపాలే కనిపిస్తాయని అతడు వ్యాఖ్యానించాడు.

Tags

Read MoreRead Less
Next Story