IPL 2024 : ఢిల్లీ కెప్టెన్ కు భారీ పైన్.. ఎందుకో తెలుసా..?

IPLలో స్ట్రాంగ్ రీఎంట్రీ ఇచ్చిన పంత్ కు (Rishabh Pant) పంచ్ పడింది. ఢిల్లీ కేపిటల్స్ (DC) కెప్టెన్ రిషబ్ పంత్ కు 12 లక్షల రూపాయల ఫైన్ ను విధించారు. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్‌తో (CSK) ఆదివారం డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు భారీ జరిమానా విధించారు. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై ఈ సీజన్ లో తమ మొదటి ఓటమిని రుచి చూశారు.
పంత్ 2024లో మొదటి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. CSKతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు పంత్‌కు జరిమానా విధించారు. మినిమమ్ ఓవర్ రేట్ ను మెయిన్ టైన్ చేయడంలో విఫలమవడంతో IPL ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఈ సీజన్‌లో అతని జట్టు చేసిన మొదటి నేరం కావడంతో, పంత్‌కి 12 లక్షల రూపాయల జరిమానా విధించారు. ఈ ఐపీఎల్ సీజన్ లో స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించిన జట్టు కెప్టెన్‌కు జరిమానా విధించడం ఇది రెండోసారి.
గత మంగళవారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు చెందిన శుభ్‌మన్ గిల్ కు కూడా ఇదే నేరానికి 12 లక్షల రూపాయల జరిమానా విధించారు. ఏడాదిన్నర ఆటకు దూరమైనా ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పేలేదని.. ఒక క్రికెటర్‌గా తాను 100 శాతం ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. గత ఏడాదిన్నరగా నేను పెద్దగా క్రికెట్ ఆడలేదు.. దాంతో ఆరంభంలో కాస్త సమయం తీసుకున్నాన్నాడు పంత్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com