IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్... అద్భుతమైన రికార్డు

ఐపీఎల్ 17వ సీజన్‌లో ఓ అద్భుత రికార్డు నమోదైంది. ఈ సీజన్‌లో రెండు సార్లు 250కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఒకే సీజన్‌లో రెండు సార్లు 250కుపైగా స్కోర్లు ఇప్పటివరకూ నమోదు కాలేదు. ఈసారి ఆ ఫీట్ సాధ్యమైంది. కాగా నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 272/7 పరుగులు చేసింది. ఇటీవల ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 277/3 పరుగులు బాదింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో (Delhi Capitals) జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knights Riders) 106 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ విధించిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఢిల్లీ బ్యాటర్లు తేలిపోయారు. పంత్(55), స్టబ్స్(54) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. దీంతో ఢిల్లీ 17.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. వైభవ్, వరుణ్ చక్రవర్తి 3, స్టార్క్ రెండు, రసెల్, నరైన్ తలో వికెట్ తీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com