T20 World Cup 2024 : వరల్డ్ కప్ లో చరిత్ర సృష్టించిన భారత్

T20 World Cup 2024 : వరల్డ్ కప్ లో చరిత్ర సృష్టించిన భారత్

టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై 6 పరుగుల తేడాతో గెలిచిన భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వరల్డ్ కప్ లో ఒకే జట్టు(పాక్)పై అత్యధికసార్లు(7) గెలిచిన జట్టుగా నిలిచింది. బంగ్లాదేశ్‌పై పాక్, విండీస్‌పై శ్రీలంక చెరో ఆరు విజయాలతో రెండో స్థానంలో ఉన్నాయి. కాగా వన్డే వరల్డ్ కప్‌లోనూ పాక్‌ను భారత్ ఎనిమిది సార్లు ఓడించింది.

టీ20 ప్రపంచ కప్‌లో లో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత 119 పరుగులకే ఆలౌట్ అయిన రోహిత్ సేన.. దాయాదిని 113/7 స్కోరుకే కట్టడి చేసింది. బుమ్రా 3, హార్దిక్ 2, అక్షర్, అర్ష్‌దీప్ చెరో వికెట్ తీశారు. బౌలర్లందరూ పొదుపుగా బౌలింగ్ చేసి భారత్‌కు అపురూప విజయాన్ని అందించారు. పాక్ బ్యాటర్లలో రిజ్వాన్ 31, బాబర్ 13, ఉస్మాన్ 13, ఫఖర్ 13, ఇమాద్ 15 రన్స్ చేశారు.

లో స్కోరింగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయంలో బుమ్రా ( Jasprit Bumrah ), హార్దిక్ ( Hardik Pandya ) కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బుమ్రా 4 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు(రిజ్వాన్, బాబర్, ఇఫ్తికార్) పడగొట్టారు. దీంతో అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. మరోవైపు హార్దిక్ 24 రన్స్ ఇచ్చి 2 వికెట్లు(ఫఖర్, షాబాద్) తీశారు. అక్షర్ 2-11-1, సిరాజ్ 4-19-0, జడేజా 2-10-0 పొదుపుగా బౌలింగ్ చేసి గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు.

Tags

Next Story