WTC Rankings : డబ్ల్యూటీసీ మళ్లీ టీమిండియా నెం-1

WTC Rankings : డబ్ల్యూటీసీ మళ్లీ టీమిండియా నెం-1

WTC : వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్2023-25లో టీమిండియా మళ్లీ నెంబర్-1 స్థానానికి దూసుకొచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో న్యూజి లాండ్ 77 ఘోర ఓటమిపాలైంది. దాంతో ఆ మ్యాచ్ కు ముందు వరకు అగ్రస్థానంలో కొనసాగుతున్న కివీస్ రెండో స్థానానికి పడిపోయింది. ఇక ఇంగ్లండ్ తో సొంతగడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టు తమ విజయాల శాతాన్ని మెరుగుపర్చుకుంది.

ప్రస్తుతం ఖాతర్ 64.58 విజయాల శాతంతో అగ్రస్థా నాకి దూసుకెళ్లింది. అలాగే ఆసీస్ చేతిలో ఓడిన న్యూజిలాండ్ 60 శాతంతో రెండో స్థానానికి పడిపోయింది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన కంగారూ జట్టు 59.09 శాతంతో మూడో స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ (50)తో నాలుగో స్థానం దక్కించుకోగా.. పాకిస్తాన్ (36.66)తో ఐదో స్థానంలో నిలిచింది.

ఇక వచ్చేఏడాది మార్చి 2025లోగా టాప్-2 స్థానాల్లో నిలిచే జట్లు ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. ఇప్పటికే వరుసగా రెండు సార్లు డబ్ల్యూటీసీ ఫైనల్స్క అర్హత సాధించిన టీమిండియా హ్యాట్రిక్ పై కన్నేసింది. మొదటి రెండు స్థానాల కోసం భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తీవ్ర పోటీ కొనసాగు తోంది. మార్చి ' నుంచి భారత్ -ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్టు ప్రారంభం కానుంది. మార్చి 8 నుంచి ఆస్ట్రేలి యా-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగునుంది.

Tags

Read MoreRead Less
Next Story