Second T20 : ఇంగ్లండ్ తో భారత్ రెండో టీ20 నేడే

Second T20 : ఇంగ్లండ్ తో భారత్ రెండో టీ20 నేడే
X

చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో అయిదు టీ20ల సిరీస్‌ లో భాగంగా సాయంత్రం రెండో టీ20 మ్యాచ్‌ జరుగనుంది. తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గ్రాండ్‌ విక్టరీ కొట్టిన టీమ్‌ఇండియా.. మరో విజయంపై కన్నేసింది. కోల్‌కతాలో మాదిరే స్పిన్నర్ల జోరు సాగే చెన్నైలోనూ ఇంగ్లిష్‌ జట్టుకు చెక్‌ పెట్టి మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని టీమ్‌ఇండియా చూస్తోంది. గాయం కారణంగా ఏడాదికి పైగా ఆటకు దూరమైన సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ షమి ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. కానీ.. స్పిన్‌కు పూర్తి అనుకూలంగా ఉన్న పిచ్‌ను దృష్టిలో ఉంచుకునే షమిని గత మ్యాచ్‌లో ఆడించలేదని జట్టు వర్గాలు తెలిపాయి. చెన్నైలోనూ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలమే అయినప్పటికీ.. షమిని ఆడిస్తారని తెలుస్తోంది. ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి లేదా మిడిలార్డర్‌ బ్యాటర్‌ రింకు సింగ్‌ అతడి కోసం స్థానాన్ని త్యాగం చేయాల్సి రావచ్చని తెలుస్తోంది. ఇక ఈడెన్‌లో స్తాచాటిన వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌లతో పాటు మూడో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ ఈ మ్యాచ్‌లోనూ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Tags

Next Story