T20 WC 2024 Record : ఒక్క మ్యాచ్ ఓడకుండా ప్రపంచకప్.. తొలి టీమ్‌గా భారత్ రికార్డు

టోర్నీ మొత్తం ఒక్క మ్యాచ్ ఓడకుండా ప్రపంచకప్ సాధించిన తొలి టీమ్‌గా భారత్ చరిత్ర సృష్టించింది. గ్రూప్ దశలో ఐర్లాండ్, పాక్, USA, సూపర్-8లో అఫ్గాన్, బంగ్లా, ఆసీస్, సెమీస్‌లో ఇంగ్లండ్, ఫైనల్‌లో సౌతాఫ్రికాను భారత్ ఓడించింది. టీ20ప్రపంచకప్ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసి రెండు సార్లు(2007, 2024) కప్ సాధించిన ఏకైక జట్టుగానూ భారత్ నిలిచింది. మిగతా 6 సందర్భాల్లోనూ రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే విజేతలు.
టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.125 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. టోర్నీ మొత్తం టీమ్ ఇండియా అసాధారణ ప్రతిభ, నిబద్ధత, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిందని ట్వీట్ చేశారు. అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ప్లేయర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.
అంతర్జాతీయ T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఓ స్పెషల్ పోస్టర్‌తో బీసీసీఐ ధన్యవాదాలు తెలిపింది. ‘T20Iలలో ఒక శకం ముగిసింది. కానీ ఆటపై వారి ప్రభావం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. లెజెండరీ ప్లేయర్లకు సెల్యూట్’ అని రాసుకొచ్చింది. వారి జెర్సీ నంబర్లు 18, 45తో పాటు ఈ వరల్డ్ కప్ విజయం వరకు కోహ్లీ, రోహిత్ జర్నీని తెలిపే ఫొటోలను జత చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com