T20 World Cup 2024 : నేడు అమెరికాతో భారత్ ఢీ.. గెలిస్తే సూపర్-8 బెర్త్

T20 World Cup 2024 : నేడు అమెరికాతో భారత్ ఢీ.. గెలిస్తే సూపర్-8 బెర్త్

టీ20 వరల్డ్ కప్ లోని గ్రూప్‌-Aలో అజేయంగా ఉన్న భారత్-అమెరికా మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. హ్యాట్రిక్ విజయంపై ఇరు జట్లూ గురిపెట్టాయి. కెనడా, పాకిస్థాన్‌పై అమెరికా గెలిచినప్పటికీ సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ సేన ముందు నిలబడటం కష్టమే. ఇవాళ విజయం సాధించిన జట్టు గ్రూప్-8 బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. రాత్రి 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.

బంగ్లాదేశ్‌తో మొదలుపెట్టిన ప్రాక్టీస్‌ మొదలు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ దాకా భారత్‌ విజయవంతమైంది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి లీగ్‌లో ప్రత్యర్థి తక్కువ లక్ష్యం నిర్దేశించడంతో కెపె్టన్‌ రోహిత్, రిషభ్‌ పంత్‌ల జోరుతో సులువుగానే ఛేదించారు. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో ‘కింగ్‌’ కోహ్లి, టి20 స్పెషలిస్టు సూర్యకుమార్‌ యాదవ్‌ ఏమాత్రం మెరిపించలేకపోయారు.

ఆడుతోంది తొలి వరల్డ్‌కప్పే అయినా అమెరికా ఆట మాత్రం అద్భుతం. కెనడా, పాక్‌లపై సాధించిన విజయాలు ఏమాత్రం గాలివాటం కాదు. మొదట కెనడాపై 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి మరీ గెలిచింది. ఆండ్రీస్‌ గౌస్, ఆరోన్‌ జోన్స్‌ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. మళ్లీ పాక్‌తో రెండో మ్యాచ్‌లో కెప్టెన్ మోనంక్‌ పటేల్‌ అర్ధసెంచరీతో ఆకట్టుకుంటే గౌస్, జోన్స్‌ ‘టై’ అయ్యేదాకా పటిష్టమైన పాక్‌ బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు.

Tags

Next Story