Indian Cricketer : లగ్జరీ ఫ్లాట్ కొన్న టీమ్ ఇండియా క్రికెటర్

టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) ముంబైలో ఓ లగ్జరీ ఫ్లాట్ కొన్నారు. రూ.20 కోట్లు వెచ్చించి బాంద్రాలో సముద్రం ఎదురుగా ఉన్న ఓ ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ ప్లేస్ గురించి కలలగనడం.. ఇప్పుడు ఇక్కడ వాటిని నిజం చేసుకోవడం.. నాకంటూ సొంత ఇల్లు.. స్వర్గం లాంటిది! ఇక ముందు అంతా మంచే జరగాలి’’ అంటూ ఉద్వేగపూరిత నోట్ రాశాడు పృథ్వీ షా.
ఈ ఫొటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాగా పృథ్వీ షా ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8 కోట్లు చెల్లించి అతడిని దక్కించుకుంది. 2018లో ఐపీఎల్‌లో అడుగు పెట్టిన పృథ్వీని ఢిల్లీ మొదట రూ. 1.2 కోట్లకు దక్కించుకుంది. అప్పటి నుంచి అతడు డీసీ తరఫునే ఆడుతున్నాడు.
అయితే, మొదటి సీజన్‌లో పర్వాలేదనిపించిన షా.. ఆ తర్వాత సీజన్లలో ఘోరంగా విఫలమయ్యాడు. కానీ, 2021 నుంచి అతడు మళ్లీ తన మునుపటి ఫామ్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్-2024 సీజన్‌తో ఈ ఓపెనింగ్ బ్యాటర్ బిజీగా ఉన్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి 119 పరుగులు సాధించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com