IPL 2024: ముంబైపై లక్నో విక్టరీ

ఐపిఎల్‌లో భాగంగా వాంఖండే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయ సాధించింది.ముంబయిపై 18 పరుగుల తేడాతో లక్నో గెలిచింది.
తొలుత లక్నో 20 ఓవర్లలో 214/6 స్కోరు చేసింది.లక్నో జట్టులో నికోలస్ పూరన్( 29 బంతుల్లో 8 సిక్స్‌లు, 5 ఫోర్లతో 75), కెప్టెన్ కేఎల్ రాహుల్((41 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 55)లు రాణించారు. ముంబై బౌలర్లలో నువాన్ తుషార, పియూష్ చావ్లా చెరో మూడు వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ముంబై 20 ఓవర్లలో 196/6 స్కోరు చేసి ఓడింది.
ముంబయి బ్యాట్స్ మెన్లలో రోహిత్ శర్మ (38 బాల్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 68), నమన్ ధీర్ (28 బాల్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 నాటౌట్) పోరాడారు. మిగితా బ్యాట్స్ మెన్ల నుంచి సహకారం లేకపోవడంతో ఓటమి తప్పలేదు. విజయంలో కీలక పాత్ర పోషించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. పాయింట్లలో పట్టికలో లక్నో 14 పాయింట్లు సాధించినా రన్‌రేట్‌లో (–0.66) వెనుకబడి ప్లేఆఫ్స్ అవకాశాన్ని కోల్పోయింది. ముంబయి 8 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com