IPL Broadcast : ఐపీఎల్‌ ప్రసారంలో.. జియో సినిమా కొత్త రికార్డు

IPL Broadcast : ఐపీఎల్‌ ప్రసారంలో.. జియో సినిమా కొత్త రికార్డు
X

ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రసారంలో కొత్త రికార్డుల్ని సృష్టించినట్లు జియో సినిమా ప్రకటించింది. ఈ సీజన్‌లో 62 కోట్ల వీక్షణలు నమోదైనట్లు వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 53శాతం ఎక్కువ. ఇక వీక్షణ సమయం 35వేల కోట్ల నిమిషాలుగా ఉందని తెలిపింది. గత ఏడాది తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఈ ఏడాది తొలిమ్యాచ్‌ను 51శాతం ఎక్కువగా (11.3 కోట్లమంది) చూశారని పేర్కొంది. ప్రేక్షకుడు సగటున 75 నిమిషాలను వెచ్చించారని చెప్పింది.గతేడాది ఈ సమయం 60 నిమిషాలుగా ఉండేది. ఇదిలా ఉంటే జియో సినిమాలో వీడియో నాణ్యతను మరింత పెంచడం కూడా వ్యూయర్‌షిప్‌ పెరగడానికి కారణంగా చెబుతున్నారు. 4కే వీడియో క్వాలిటీ, మల్టీ క్యామ్‌ ఆప్షన్స్‌, 12 భాషల్లో ఫీడ్‌తో పాటు అదనంగా ఆర్‌/వీఆర్‌ వంటి సదుపాయాలు తీసుకురావడం కూడా ఈ రికార్డు సాధించడానికి కారణంగా చెబుతున్నారు.

Tags

Next Story