Noor Ahmad : ఐపీఎల్ ఆటగాడు నూర్ అహ్మద్‌పై 12 నెలల నిషేధం?

ఐపీఎల్ (IPL) ఇండియాలో క్రికెట్ రూపురేఖలు మార్చేసింది. ఒకప్పుడు జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తే చాలు ఇక జీవితానికి అంతకంటే ఇంకేం వద్దు అనుకునేవారు ఆటగాళ్లు.. ఇటీవల కాలంలో మాత్రం ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ తరఫున క్రికెట్ ఆడి కోట్ల రూపాయలు సంపాదించడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు. ఆదాయ వస్తుండటంతో.. ఇలాంటి లీగ్స్ పెరుగుతున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ జట్టులో స్టార్ స్పిన్నర్ గా కొనసాగుతూ వున్నాడు నూర్ అహ్మద్ (Noor Ahmad). ఆ జట్టు తరఫున మూడు ఫార్మాట్లకు కూడా ప్రాతినిధ్యం వహిస్తూ అదరగొడుతున్నాడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున అతను ఆడుతున్నాడు. మరోవైపు ఇంటర్నేషనల్ లీగ్ టి20 లో కూడా ఆడుతున్నాడు. ఇటీవలే నూరు అహ్మద్ పై ఇంటర్నేషనల్ లీగ్ టి20 నిర్వాహకులు నిషేధాన్ని విధించారు. షార్జా వారియర్స్ టీం లో ఉన్న నూర్ అహ్మద్ కాంట్రాక్టు ను అతడి ఫ్రాంచైజీ ఏడాది పాటు పొడగించింది. రిటెన్షన్ ఒప్పందంపై సంతకం చేయకుండా అతను సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ ఆడాడు. దీంతో లీగ్ క్రమశిక్షణ కమిటీ అతనిపై చర్యలు తీసుకుంది. మొదట 20 నెలల పాటు నిషేధం విధించినప్పటికీ కాంట్రాక్టు ఒప్పందం జరిగినప్పుడు అతను మైనర్ కావడంతో ఇక ఈ నిషేధాన్ని 12 నెలలకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com