Sania Mirza and Mohammad Shami : సానియా, షమీ మ్యారేజ్?.. లేటెస్ట్ అప్ డేట్

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ( Sania Mirza ) మరో పెళ్లిపై వార్తలు వైరల్ అవుతున్నాయి. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో వివాహ బంధానికి ముగింపు పలికిన ఆమె మళ్లీ పెళ్లి చేసుకోనున్నట్లు కొంతకాలంగా వదంతులు వినిపిస్తున్నాయి. టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీని ( Mohammad Shami ) సానియా పెళ్లాడనున్నారని కొందరు అంటున్నారు.
వీటిపై టెన్నిస్ స్టార్ తండ్రి ఇమ్రాన్ మీర్జా తాజాగా స్పందించారు. 'ఇవన్నీ చెత్త వార్తలు. సానియా కనీసం షమీని కలవనేలేదు. వారిద్దరికీ పెద్దగా పరిచయమే లేదు' అంటూ ఊహాగానాలను
కొట్టిపారేశారు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ను సానియా 2010లో వివాహం చేసుకుంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో షోయబ్ మరో అమ్మాయిని వివాహం చేసుకోవడంతో.. వీరిద్దరూ విడిపోయినట్లు స్పష్టమైంది.
అంతకు కొన్ని నెలల కిందటే వీరు విడాకులు తీసుకున్నట్లు సానియా కుటుంబం ప్రకటించింది. ఇటీవల హజ్ యాత్రకు వెళ్తూ సానియా ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఈ యాత్రతో తన జీవితంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నానని, బలమైన వ్యక్తిగా తిరిగొస్తానని ఆమె రాసింది. కొత్త పెళ్లికి, లేదా కొత్త మజిలీకి సానియా సిద్ధమైందని ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com