IP 2024 : ధోనీ రికార్డును సమం చేసిన జడేజా

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోనీ పేరిట ఉన్న ఓ రికార్డును ఆ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సమం చేశారు. అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన CSK ప్లేయర్‌గా నిలిచారు. ధోనీ, జడేజా ఇప్పటివరకు 15 సార్లు PoTM అవార్డ్స్ గెలవగా, ఆ తర్వాతి స్థానాల్లో సురేశ్ రైనా (12), రుతురాజ్ గైక్వాడ్ (10), హస్సీ (10) ఉన్నారు.
అంతేకాకుండా జడేజా అరుదైన ఘనత సాధించారు. నిన్న కేకేఆర్‌తో మ్యాచులు రెండు క్యాచులు పట్టడం ద్వారా ఐపీఎల్‌లో 100 క్యాచులు పట్టిన ఆటగాళ్ల లిస్ట్‌లో చేరారు. దీంతో ముంబై ప్లేయర్ రోహిత్ శర్మతో కలిసి జడేజా ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. ఓవరాల్‌గా ఈ లిస్ట్‌లో కోహ్లీ(110), రైనా(109), పొలార్డ్(103) ముందు వరసలో ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే నిన్న చెపాక్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్కే సునాయాస విజయం సాధించింది. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రుతురాజ్ హాఫ్ సెంచరీతో(67* రన్స్) రాణించారు. దూబే 18 బంతుల్లో 28 రన్స్‌తో మెరుపులు మెరిపించారు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు, నరైన్ ఒక వికెట్ తీశారు. ఈ సీజన్‌లో కేకేఆర్‌కు ఇదే తొలి ఓటమి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com