James Anderson : పేసింగ్ లెజెండ్ అండర్సన్‌కు ఘనమైన వీడ్కోలు

ప్రపంచంలోనే మేటి పేసర్ జేమ్స్ అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్ కు ఘనంగా వీడ్కోలు పలికాడు. సొంతగడ్డపై లార్డ్స్ టెస్టులో ఆడిన జిమ్మీ విజయంతో కెరీర్ ముగించాడు. తన ఆఖరి టెస్టులో నాలుగు వికెట్లు తీసిన ఇంగ్లండ్ వెటరన్ సగర్వంగా ఆటకు గుడ్ బై చెప్పేశాడు. దాంతో, ప్రపంచ క్రికెట్లో ఓ మహాయోధుడి శకం ముగిసింది. 22 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అండర్సన్ అధిగమించాడు.
అంతర్జాతీయ క్రికెట్లో 22 ఏండ్ల జర్నీ.. అంత ఈజీ కాదు. అలాంటిది ఓ పేసర్ గాయాలను తట్టుకుని, ఫిటినెస్ కాపాడుకొని 401 మ్యాచ్ లు ఆడాడంటే అద్భుతమే. మూడు ఫార్మాట్లలో 401 మ్యాచ్ లు ఆడిన అండర్సన్ మొత్తంగా 991 వికెట్లు పడగొట్టాడు. అయితే వీటిలో అత్యధికం టెస్టుల్లో వచ్చినవే. రెడ్ బాల్ క్రికెట్లో 704, వన్డేల్లో 269, టీ20ల్లో 18 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. దాంతో, 'హ్యాపీ రిటైర్మెంట్', 'థ్యాంక్యూ అండర్సన్' హ్యాష్యాగ్ లు ట్రెండింగ్ లో ఉన్నాయి.
టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్ల జాబితాలో అండర్సన్ ఒకడు. శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో టాప్ లో ఉండగా.. 708 వికెట్లు తీసిన దివంగత షేన్ వార్న్(ఆస్ట్రేలియా) రెండో స్థానంలో ఉన్నాడు. 188 మ్యాచుల్లో 704 వికెట్లు పడగొట్టిన జిమ్మీ మూడో స్థానంలో నిలిచాడు. భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (619), ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ 604) లు వరుసగా నాలుగు, ఐదో ప్లేస్ లో నిలిచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com