జో రూట్.. కెరీర్ బెస్ట్ ఫ్లాప్ షో.. సరిగా వాడుకోండి సార్..!

జో రూట్.. కెరీర్ బెస్ట్ ఫ్లాప్ షో.. సరిగా వాడుకోండి సార్..!

సెంచరీలు కొట్టే స్ట్రాంగ్ బ్యాట్స్ మన్, ఇంగ్లండ్ (England) సెన్సేషన్ జోరూట్ (Joe Root) కెరీర్ లో గడ్డు రోజులు చూస్తున్నాడు. భారత జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో వరుసగా విఫలమవుతున్నాడు. ఆరు ఇన్నింగ్స్ ల్లో 77 పరుగులు మాత్రమే చేసి చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు.

మరో అండ్రూ ప్లింటాఫ్, సూపర్ ఆల్ రౌండర్ అనే పేరు తెచ్చుకున్న జో రూట్.. సడెన్ గా ఫెయిలవుతున్నాడు. హైదరాబాద్ మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి జో రూట్ ఐదు వికెట్లు తీశాడు. పార్ట్ టైం స్పిన్నర్ అయినప్పటికీ మూడు టెస్టుల్లో ఓవర్లకు పైగా బౌలింగ్ చేశాడు. అటు బ్యాటింగ్ లోనూ రూట్ వైఫల్యం కొనసాగుతోంది. ఇంగ్లంట్ ప్రస్తుత టెస్ట్ టీం ప్లేయర్లు అందరికన్నా జో రూట్ చేసిన రన్సే ఎక్కువ. ఐనా కానీ.. ఈ సిరీస్ లో రూట్ ఫ్లాపవుతున్నాడు.

ఐతే.. జో రూట్ కు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ సపోర్ట్ చేస్తున్నారు. బౌలింగ్ ఎక్కువగా వేసిన ఆటగాడి నుంచి బ్యాటింగ్ ఆశించొద్దని సూచించాడు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మార్క్ బుచర్. బ్యాటింగ్ కోరుకుంటే జో రూట్ నుంచి బౌలింగ్ తక్కువ ఆశించాలని మాజీలు కోరుతున్నారు. నాలుగో టెస్ట్ మ్యాచ్ లో నైనా కెప్టెన్ స్టోక్స్.. తమ ప్లేయర్లను సరైన విధంగా వాడుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story