Jos Buttler : మరోసారి తండ్రి కాబోతున్న జోస్ బట్లర్

Jos Buttler : మరోసారి తండ్రి కాబోతున్న జోస్ బట్లర్
X

ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్, అతని భార్య లూసీ మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు వెల్లడించింది. దీంతో పాక్‌తో నేడు జరిగే మూడో టీ20కి అతను దూరం కానున్నట్లు తెలిపింది. అతనికి, అతని ఫ్యామిలీకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేసింది. జోస్ దంపతులకు ఇప్పటికే జార్జియా రోస్, మార్గోట్ అనే ఇద్దరు కూతుళ్లున్నారు.

ఈ క్రమంలోనే మూడో టీ20కు జోస్ దూరం కానున్నాడు. నాలుగో టీ20కు కూడా అతడి అందుబాటులో ఉండేది అనుమానమే. బట్లర్ గైర్హజరీలో స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఇంగ్లీష్ జట్టును నడిపించనున్నాడు. దీంతో అతడు ఈ మెగా ఈవెంట్ మొత్తం మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నట్లు ఇంగ్లండ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇక నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో పాక్‌పై ఇంగ్లండ్ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బట్లర్ 51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు.

Tags

Next Story