Kavya Maran : కావ్య మారన్ ఫైనల్ సంబరం.. వీడియో వైరల్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ ఫైనల్ కు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చేరడంతో ఆ జట్టు యజమాని కావ్య మారన్ ఆనందంతో ఉప్పొంగి పోయారు. భావోద్వేగాలకు గురయ్యే ఆమె ముఖం ఈసారి వెలిగిపోయింది. గెలిచిన వెంటనే సన్‌రైజర్స్ సభ్యులతో షేక్ హ్యాండ్ ఇస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది.
ఆరేళ్ల తర్వాత తమ జట్టు ఫైనల్ చేరడంతో సన్ రైజర్స్ టీమ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈసారి కప్పు కొట్టాలని పట్టుదల మీదున్నారు. శుక్రవారం రాత్రి చెన్నై వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 36 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. రాజస్థాన్ రాయల్స్ ఓటమితో ఓ యువతి మైదానంలో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది.
ఆదివారం చెన్నైలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కోసం అటు చెన్నై ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com