Kavya Maran : కేన్ విలియమ్సన్‌కు కావ్య మారన్ కౌగిలి
ఐపీఎల్ అంటేనే ఆనందం.. ఉత్సాహం... కేరింతలు.. అందాలు.. బంధనాలు. అలా.. హైదరాబాద్ సన్ రైజర్స్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది ఫ్రాంచైజీ ప్రమోటర్ కావ్య మారన్. ఆమె అందం, ఎక్స్ ప్రెషన్స్.. అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
ఉప్పల్ వేదికగా జరగాల్సిన SRH-GT మ్యాచ్ వర్షం కారణంగా గురువారం రాత్రి రద్దు అయింది. సాయంత్రం నుంచి కొనసాగిన వాన ఎంతకీ తగ్గకపోవడంతో టాస్ వేయకుండానే మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది.
మరో లీగ్ మ్యాచ్ మిగిలి ఉండగానే 15 పాయింట్లతో హైదరాబాద్ నేరుగా ప్లేఆప్స్ కు చేరుకుంది. GT ఇప్పటికే టోర్నీనుంచి వైదొలిగింది. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ కు చేరుకోవడంతో... కావ్య సంబరపడింది. కేన్ విలియమ్సన్ ను గట్టిగా హగ్ చేసుకుంది కావ్య. ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com