IPL 2024 : హైదరాబాద్, ఢిల్లీ మధ్య కీలక ఫైట్.. జట్లు ఇవే

IPL 2024 : హైదరాబాద్, ఢిల్లీ మధ్య కీలక ఫైట్.. జట్లు ఇవే

ఐపీఎల్ లో హైదరాబాద్ మ్యాచ్ ఉందంటే ఆ రోజు క్రికెట్ ఫ్యాన్స్ అంతా మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ 17వ సీజన్లో భాగంగా అలాంటి మరో ఉత్కంఠ భరితమైన మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో జోరు మీదున్న హైదరాబాద్.. ఢిల్లీతో పైట్ చేస్తోంది. ఈ రెండు జట్లలో హైదరాబాద్ కాస్త బలంగా కనిపిస్తున్నప్పటికీ.. ఢిల్లీని తక్కువ అంచనా వేయలేరు.

గత రెండు మ్యాచ్ లలోనూ ఢిల్లీ చేసిన ఫైట్ ఆకట్టుకుంది. శనివారం రాత్రి హైదరాబాద్, ఢిల్లీ జట్ల మధ్య జరిగే పోరు ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్లో ఒకవేళ హైదరాబాద్ గెలిస్తే పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి వెళుతుంది. ఢిల్లీ గెలిస్తే నెట్ రన్ రేట్ మెరుగుపరచుకొని లక్నో స్థానాన్ని ఆక్రమించి... ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది.

బలమైన చెన్నై, ముంబై, బెంగళూరు జట్లను ఓడించి హైదరాబాద్ శక్తిమంతమైన జట్టుగా అవతరించింది. టోర్నీ ఫేవరిట్ అనిపించుకుంటోంది.

జట్ల అంచనా

హైదరాబాద్ : మార్క్రం, క్లాసెన్, హెడ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కమిన్స్ (కెప్టెన్), జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, నటరాజన్.

ఢిల్లీ : రిషబ్ పంత్ (కెప్టెన్), కులదీప్ యాదవ్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, డేవిడ్ వార్నర్, స్టబ్స్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, మెక్ గ్రూక్, అభిషేక్ పోరెల్, నోర్ట్ జీ, శై హాప్.

Tags

Read MoreRead Less
Next Story