Kuldeep Yadav : పాకిస్థాన్ లో ఆడేందుకు రెడీ : కుల్ దీప్ యాదవ్

వన్డే క్రికెట్ చాంపియన్స్ ట్రోఫీ.. వచ్చే ఏడాది పాకిస్థాన్ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముసాయిదా షెడ్యూల్ ను పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి సమర్పించింది. ప్లేయర్ల సెక్యూరిటీ, ఇతర కారణాల నేపథ్యంలో టీమిండియా చాలాకాలంగా పాక్ పర్యటనకు వెళ్లట్లేదు. దీంతో ఇప్పుడు ఈ టోర్నీ కోసం పాకిస్థాన్‌కు టీమిండియా వెళ్తుందా? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ నిర్ణయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉందని బీసీసీఐ స్పష్టం చేసింది. భారత స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఈ అంశంపై స్పందించాడు. ఒకవేళ అవకాశం వస్తే టీమిండియాతో కలిసి పాకిస్థాన్ కు వెళ్లి అక్కడ ఆడతానని చెప్పాడు. ‘క్రికెటర్లుగా మమ్మల్ని ఎక్కడికి పంపినా వెళ్లి ఆడటానికి సిద్ధంగా ఉంటాం. అది మా బాధ్యత. ఇంతకు ముందెన్నడూ పాకిస్థాన్‌కి వెళ్లి ఆడలేదు. అవకాశం వస్తే తప్పకుండా వెళ్లి ఆడతాను’ అని కుల్‌దీప్ చెప్పుకొచ్చాడు.షెడ్యూల్ ప్రకారం 2025లో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు చాంపియన్స్ ట్రోఫి జరగాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com