MP Vijay Vasanth : అశ్విన్‌కు ఖేల్‌ రత్న అవార్డు ఇవ్వాలి : ఎంపీ విజయ్‌ వసంత్‌

MP Vijay Vasanth : అశ్విన్‌కు ఖేల్‌ రత్న అవార్డు ఇవ్వాలి : ఎంపీ విజయ్‌ వసంత్‌
X

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన భారత ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు ఇవ్వాలని కేంద్రానికి కాంగ్రెస్‌ ఎంపీ విజయ్‌ వసంత్‌ అభ్యర్థన చేశారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక పోస్టు పెట్టారు. అశ్విన్‌ భారత క్రికెట్‌కు అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఖేల్‌ రత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర యువజన క్రీడల మంత్రి మన్‌సుక్‌ మాండవీయను కోరారు. ‘అశ్విన్‌కు మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న అవార్డు ఇవ్వాలని క్రీడల మంత్రి మన్‌సుక్‌ మాండవీయను కోరాను. భారత క్రికెట్‌కు అశ్విన్‌ అందించిన సేవలకు అమూల్యమైనవి. ఆయన ఖేల్‌ రత్న అవార్డుకు అర్హుడు’ అని ఎంపీ విజయ్‌ వసంత్‌ పేర్కొన్నారు.

Tags

Next Story