Rohit Sharma Record : ముంబై ఘోర ఓటమి.. రోహిత్ శర్మ చెత్త రికార్డు

రాజస్థాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఘోర పరాజయం పొందింది. సొంత గడ్డపై ముంబై ప్లేయర్లు డకౌట్ అవడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఎక్కువ సార్లు జీరో డిజిట్‌కే వెనుదిరగడంతో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ లో ఎక్కువసార్లు(17) డకౌట్ అయిన ప్లేయర్‌గా దినేశ్ కార్తీక్ సరసన చేరారు.
ఐపీఎల్‌లో అత్యధిక డకౌట్స్:
రోహిత్ శర్మ- 17
దినేశ్ కార్తిక్- 17
గ్లెన్ మ్యాక్స్‌వెల్- 15
పియూష్ చావ్లా- 15
మన్‌దీప్ సింగ్- 15
సునీల్ నరైన్- 15
ఇక ఐపీఎల్ 2024లో కెప్టెన్సీ కోల్పోయి కేవలం ప్లేయర్‌గానే ఆడుతున్న రోహిత్ శర్మ.. ఆశించిన మేర రాణించలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో ఆడిన 3 మ్యాచుల్లోనూ కేవలం 69 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 42.
ఇప్పటికే వరుస ఓటములతో డీలాపడ్డ ముంబైని చెత్త రికార్డులు వెంటాడుతున్నాయి. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన MI కేవలం 125 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈ సీజన్‌లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 15.3ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. అంతకుముందు చెన్నైతో మ్యాచ్‌లో గుజరాత్ 143/8 నమోదు చేసింది. దాన్ని ముంబై చెరిపేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com