Australian Cricketer : చరిత్ర సృష్టించిన నాథన్ లయన్

ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఏడో బౌలర్ గా లయన్ రికార్డు క్రియేట్ చేశారు. శుక్రవారం వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టిమ్ సౌథీ వికెట్ తీసిన తరువాత ఈ ఫిట్ అందుకున్నాడు. లియాన్ ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో ఏడవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షేన్ వార్న్ , గ్లెన్ మెక్‌గ్రాత్ తర్వాత ఆస్ట్రేలియా తరపున మూడవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
ఇక అత్యధిక వికెట్లు తీసిన వారిలో అగ్రస్థానంలో ముత్తయ్య మురళీధరన్ (800) ఉన్నారు. వార్న్ 708 స్కాల్ప్‌లతో రెండో స్థానంలో నిలిచాడు. తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ అండర్సన్ (698), భారత మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే (619), ఇంగ్లండ్‌కు చెందిన స్టువర్ట్ బ్రాడ్ (604), ఆస్ట్రేలియాకు చెందిన మెక్‌గ్రాత్ (563) ఉన్నారు.
కాగా నాథన్ మెక్‌గ్రాత్‌ను బీట్ చేయడానికి ఇంకా 42 వికెట్లు అవసరం. ఇక మ్యాచ్ విషయాకి వచ్చేసరికి ఆస్ట్రేలియా 204 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. నాథన్ లియాన్ 43 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు టెస్టుల్లో మొత్తం 32వేల 440 బంతులు వేసిన లియాన్ 521 వికెట్లు పడగొట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com