Cricket : క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వాగ్నర్

న్యూజిలాండ్ వెటరన్ పేసర్ నీల్ వాగ్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.. స్వదేశంలో ఫిబ్రవరి 29 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్ అనంతరం తాను ఇంటర్ననేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటానని వెల్లడించాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ కూడా ధృవీకరించింది.
"న్యూజిలాండ్ తరపున అత్యున్నత స్ధాయిలో ఆడటం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. కివీస్ జట్టు తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన ప్రతి ఒక్క క్షణాన్ని ఎంతగానో ఆస్వాదించాను. అయితే ఇప్పుడు కొత్త ప్లేయర్స్కు ఛాన్స్ ఇచ్చే సమయం అసన్నమైంది. అందుకే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. ఆసీస్‌తో సిరీస్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు విడ్కోలు పలుకుతాను. నా 12 ఏళ్ల కెరీర్‌లో అండగా నిలిచిన న్యూజిలాండ్ క్రికెట్‌కు, సహ ఆటగాళ్లకు, అభిమానులకు ధన్యవాదాలు" అంటూ చెప్పుకొచ్చాడు నీల్.
2012లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో కివీస్ తరపున అరంగేట్రం చేసిన వాగ్నర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్నాడు. వాగ్నర్ కేవలం టెస్టుల్లో మాత్రమే న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 64 టెస్టులు ఆడిన 37 ఏళ్ల వాగ్నర్.. 260 వికెట్లు పడగొట్టాడు. రిచర్డ్ హడ్లే తర్వాత మెరుగైన సగటుతో వందకు పైగా వికెట్లు తీసిన రెండో కివీస్ బౌలర్‌గా అతడు రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఐదో కివీస్ బౌలర్‌గా వాగ్నర్ కొనసాగుతున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com