విధ్వంసం.. 62 బంతుల్లో 135 రన్స్

నెదర్లాండ్స్ క్రికెటర్ (Netherland Cricketer) మైకేల్ లెవిట్ (Michael Levitt) చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన నెదర్లాండ్స్ బ్యాటర్ లెవిట్ (135) రికార్డు నమోదు చేశారు. నమీబియాతో జరిగిన మూడో టీ20లో అతడు 62 బంతుల్లో 135 పరుగులతో విధ్వంసం సృష్టించారు. ఇందులో 11 ఫోర్లు, 10 సిక్స్ లు ఉన్నాయి.
అతనికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ సైబ్రండ్ ఎంగెల్బ్రెట్ సూపర్ హాఫ్ సెంచరీ(40 బంతుల్లో 75 పరుగులు) చేశాడు. లెవిట్ స్ట్రైక్‌రేటు 217.74గా నమోదు కాగా.. సైబ్రండ్ స్ట్రైక్‌రేటు 187.50 కావడం విశేషం. లెవిట్, సైబ్రండ్ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 178 పరుగులు జోడించారు.
నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 247 పరుగులు చేసింది. కాగా తాను ఆడిన తొలి 2 మ్యాచ్లలోనే లెవిట్ ఓ ఫిఫ్టీ, హండ్రెడ్ బాదడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com