TeamIndia : చరిత్రకు మరో అడుగు దూరంలో టీమిండియా

TeamIndia : చరిత్రకు మరో అడుగు దూరంలో టీమిండియా

టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా తన జైత్రయాత్ర కొనసాగిస్తూ ఫైనల్‌కు చేరింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి జట్లపై ప్రతీకారం తీర్చుకుని మరీ పదేళ్ల తర్వాత ఫైనల్లో అడుగు పెట్టింది. వన్డే వరల్డ్ కప్ చేజారడంతో పొట్టి ప్రపంచకప్ సాధించాలని భారత్ పట్టుదలతో ఉంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ చేజిక్కించుకోవాలని యోచిస్తోంది.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు టీమ్ ఇండియా చేరుకోవడంలో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించారు. టోర్నీ ఆసాంతం ఇద్దరూ జట్టును ముందుండి నడిపించారు. రోహిత్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి 248 పరుగులు చేసి భారత్ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నారు. అలాగే పాండ్య అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో రాణించారు. 139 రన్స్‌తో పాటు 8 వికెట్లు తీసి జట్టు విజయాలకు కృషి చేశారు.

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై విజయంతో టీమ్ ఇండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్‌లో సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ నెల 29న బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. కాగా ఇరు జట్లు టోర్నీలో ఓటమే లేకుండా ఫైనల్‌కు చేరుకున్నాయి. దీంతో తుది సమరం రసవత్తరంగా జరగనుంది.

Tags

Next Story