Pakistan Head Coach : పాకిస్థాన్ హెడ్ కోచ్‌గా అజహర్

పాకిస్థాన్ (Pakistan) హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ ఆటగాడు అజహర్ మహమూద్ (Azhar Mahmood) ఎంపికయ్యారు. ఈ నెల 18 నుంచి న్యూజిలాండ్‌తో (New Zealand) జరగబోయే టీ20 సిరీస్‌కు ఆయన కోచ్‌గా పనిచేయనున్నారు. కాగా అజహర్ పాక్ తరఫున 164 మ్యాచ్‌లు ఆడి 162 వికెట్లు పడగొట్టారు. అలాగే బ్యాటింగ్‌లో 2421 పరుగులు చేశారు. గతంలో పాక్ బౌలింగ్ కోచ్‌గా కూడా విధులు నిర్వర్తించారు.
కాగా అజహర్ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు 23 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించారు. ఇక న్యూజిలాండ్‌తో ఐదు టీ20 మ్యాచుల సిరీస్‌కు పాకిస్థాన్ ఇవాళ జట్టును ఎంపిక చేయనుంది. న్యూజిలాండ్ సిరీస్‌కు మహ్మద్ యూసుఫ్, సయీద్ అజ్మల్ బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు.
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు పాక్‌లో పర్యటింనుంది. ఈ సిరీస్ ఏప్రిల్ 18, 20, 21, 25, 27 తేదీల్లో జరుగుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మూడు మ్యాచ్‌లకు రావల్పిండి వేదిక కానుండగా.. ఆఖరి రెండు మ్యాచ్‌లు లాహోర్‌లో జరుగనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com