T20 World Cup : పాకిస్థాన్‌కు ఎసరు.. టీట్వంటీ వరల్డ్ కప్‌కు టెర్రర్ వార్నింగ్

T20 World Cup : పాకిస్థాన్‌కు ఎసరు.. టీట్వంటీ వరల్డ్ కప్‌కు టెర్రర్ వార్నింగ్

టీట్వంటీ ప్రపంచకప్ కు ఉగ్ర కష్టాలు వచ్చిపడ్డాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు టెర్రరిస్టులు వార్నింగ్ ఇచ్చారు. ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన కొద్దిరోజులకే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ సారి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఈ ప్రపంచప్‌కు ఆతిధ్యం అందిస్తున్నాయి. ఓ ఉగ్రవాద సంస్థ టీ20 ప్రపంచకప్ ను జరగనివ్వమని.. పాకిస్తాన్ నుంచి హెచ్చరించారు.

టెర్రర్ వార్నింగ్స్ తో టీ20 ప్రపంచ కప్ నిర్వహణకు ఉగ్రవాదలు భయం పట్టుకుంది. దీనిపై ఐసీసీ, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు స్పందించింది. జూన్ 12 నుంచి జరగబోయే టీ20 ప్రపంచ కప్ కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని.. ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత కి ప్రణాళికలు రూపొందించామని స్థానిక ప్రభుత్వాల సపోర్ట్ ఉందని తెలిపాయి.

పాకిస్తాన్ ఉగ్రవాదుల హెచ్చరికలు రావడంతో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది. వచ్చే సంవత్సరంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాలని చూస్తున్న క్రమంలో తాజా పరిణామాల దృష్ట్యా పాకిస్తాన్‌కు అవకాశం ఇవ్వడం కష్టమేనని ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఏ టోర్నీ అయినా మ్యాచ్ ల నిర్వహణకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని.. హామీ ఇచ్చారు ఆర్గనైజర్లు.

Tags

Next Story