ICC Champions Trophy : పాకిస్థాన్ చెత్త రికార్డు నమోదు

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ చెత్త రికార్డు నమోదు చేసింది. గత 23 ఏళ్లలో ఒక ICC టోర్నీకి ఆతిథ్యమిస్తూ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవని జట్టుగా నిలిచింది. చివరిసారిగా 2000లో కెన్యా ఈ అపఖ్యాతిని మూటగట్టుకుంది. 1996 తర్వాత పాక్‌కు ICC టోర్నమెంట్ నిర్వహించే అవకాశం వచ్చింది. దీంతో తమ జట్టు ప్రదర్శనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. పాకిస్థాన్ టీమ్ పరిస్థితి దిగజారిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఈ ఏడాది టీమ్ఇండియా మరో మూడు మ్యాచులు ఆడే అవకాశముంది. ఆసియా కప్-2025లో అన్నీ కుదిరితే ఇరుజట్లు మూడు సార్లు తలపడతాయని సమాచారం. గ్రూప్ దశలో ఓసారి, సూపర్ ఫోర్ దశలో మరోసారి, ఫైనల్ వరకు వెళ్తే ఇంకోసారి తలపడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నీ శ్రీలంక లేదా యూఏఈలో జరిగే అవకాశం ఉంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com