PM Modi : బుమ్రా కొడుకును ఆడించిన మోదీ

PM Modi : బుమ్రా కొడుకును ఆడించిన మోదీ
X

టీమ్ ఇండియా స్టార్ పేసర్ బుమ్రా ( Jasprit Bumrah ) తన కుటుంబంతో సహా ప్రధాని నరేంద్ర మోదీని ( Narendra Modi ) కలిశారు. ఈ సందర్భంగా బుమ్రా కొడుకు అంగద్‌ను మోదీ ఎత్తుకుని కాసేపు ఆడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు టీమ్ ఇండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ కూడా మోదీతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

టీ20 WC-2024 ట్రోఫీని గెలుపొంది స్వదేశానికి తిరిగివచ్చిన భారత జట్టును ప్రధాని మోదీ కలుసుకొని ప్రతి ఒక్కరినీ అభినందించారు. విశ్వవిజేతల కుటుంబాలను కలుసుకొని వారితో సందడిగా గడిపారు. ఈక్రమంలో CWC2023 ఫైనల్‌లో ఓడిపోయినప్పుడు మోదీ టీమ్ఇండియాను కలిసి ఆటగాళ్లలో స్థైర్యాన్ని నింపిన సన్నివేశాన్ని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఓటమిలోనూ, గెలుపులోనూ మోదీ టీమ్‌కు తోడుగా ఉన్నారని ట్వీట్స్ చేస్తున్నారు.

మరోవైపు బార్బడోస్‌లో ఉన్న భారత క్రికెటర్లు ఎయిర్ ఇండియా విమానంలో భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఫ్లైట్ నెవార్క్ నుంచి ఢిల్లీ రావాల్సినదని, చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసి ఆటగాళ్ల కోసం బార్బడోస్‌కు మళ్లించారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేయలేదని సోషల్ మీడియాలో వాపోయారు. దీంతో సీరియస్ అయిన DGCA తమకు సమగ్ర నివేదికను అందించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది.

Tags

Next Story