Cricket : పృథ్వీ షాపై వేటు .. రంజీ జట్టు నుంచి తప్పించిన ముంబై

టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షాకు మంబయి బిగ్ షాక్ ఇచ్చింది. రంజీ ట్రోఫీలో ముంబైకి ఆడుతున్న అతన్ని త్రిపురతో జరగబోయే మ్యాచ్ నుంచి తప్పించారు. షాను పక్కనపెట్టడానికి గల కారణాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ వెల్లడించలేదు. టోర్నీలో గత రెండు మ్యాచ్‌ల్లోనూ అతను ఆకట్టుకోలేదు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 59 పరుగులే చేశాడు. ఫిట్‌నెస్, క్రమశిక్షణా రాహిత్యమే అతనిపై వేటు వేయడానికి కారణమని తెలుస్తోంది. నెట్ సెషన్స్‌కు అతడు ఆలస్యంగా రావడంతోపాటు అప్పుడప్పుడు డుమ్మా కొడుతున్నాడట. ఒక వేళ పాల్గొన్నా.. వాటిని సీరియస్‌గా తీసుకోవట్లేదని సమాచారం. అతడి ఫిట్‌నెస్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. పృథ్వీ షా అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నాడట. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ముంబయి క్రికెట్ అసోసియేషన్ సెలక్టర్లు అతడిపై క్రమశిక్షణాచర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com