IPL 2024 : ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్

బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమితో పంజాబ్ కింగ్స్ నాకౌట్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ సీజన్‌లో ఎలిమినేటైన రెండో జట్టుగా పంజాబ్ నిలిచింది. ఆ జట్టు ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు నాలుగింటిలో గెలిచి ఎనిమిది ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. లీగ్ స్టేజ్‌లోనే నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించడం పంజాబ్‌కు ఇది 15వసారి. ఒకే ఒక్కసారి ఫైనల్‌కు వెళ్లింది.
బెంగళూరు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో RCB 60 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. 242 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ 181 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో రూసో (61), శశాంక్ సింగ్ (37) రాణించారు. సిరాజ్ 3 వికెట్లు పడగొట్టారు. స్వప్నిల్ సింగ్, ఫెర్గ్యూసన్, కర్ణ్ శర్మ తలో 2 వికెట్లు తీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com