IPL : పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు 200కుపైగా పరుగులు సమర్పించుకున్న జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు పంజాబ్ 28 సార్లు 200కుపైగా రన్స్ ఇచ్చింది. ఆ తర్వాత స్థానంలో ఆర్సీబీ (27), ఢిల్లీ క్యాపిటల్స్ (21) ఉన్నాయి. కాగా ఇవాళ కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ 261 పరుగులు ఇచ్చింది.
ఇక ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ పెను సంచలనం సృష్టించింది. కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఏకంగా 262 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జానీ బెయిర్‌స్టో (108*) సెంచరీతో విధ్వంసం సృష్టించారు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (54) అర్ధశతకంతో పాటు చివర్లో శశాంక్ సింగ్ (68*) మెరుపులు మెరిపించారు. సునీల్ నరైన్ ఒక వికెట్ తీశారు.
కోల్ కత్తాపై 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసి పంజాబ్ చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్‌లోనే ఇది అత్యధికం. సెకండ్ ఇన్నింగ్సులో హయ్యెస్ట్ స్కోరు కూడా ఇదే. అత్యధిక రన్స్ ఛేజ్ చేసిన జట్ల(మెన్స్)లో సౌతాఫ్రికా-259(vsవెస్టిండీస్), మిడిలెక్స్-253(vsసర్రే), ఆస్ట్రేలియా-244(vsకివీస్), బల్గేరియా-243(vsసెర్బియా), ముల్తాన్ సుల్తాన్స్-243(vs పెషావర్ జల్మి) ఉన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com