PV Sindhu : నా బయోపిక్ లో ఆమే హీరోయిన్.. ఆయన సినిమాలు కొన్ని నచ్చవు : పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు(PV Sindhu) ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాలు, హీరోల గురించి మాట్లాడిన ఆమె.. తెలుగులో తన అభిమాన నటుడు ప్రభాస్(Prabahs) అని చెప్పుకొచ్చారు. ఆయనంటే క్రష్ కూడా ఉందని తన మనసులోని మాటను బయట పెట్టేశారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. త్వరలో తెలుగు సినిమాలో నటించబోతున్నట్లు వస్తున్న వార్తలపైనా క్లారిటీ ఇచ్చారు.
తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయాల గురించి చెప్పిన సింధు.. కాలక్షేపానికి సినిమాలు చూస్తానన్నారు. తనకిష్టమైన హీరో అంటే ప్రభాస్ అని, ఆయన నటన అంటే చాలా ఇష్టమన్నారు. కానీ ఆయన్ని ఇప్పటివరకూ డైరెక్ట్ గా కలిసే అవకాశం దక్కలేదని వాపోయారు. రామ్ చరణ్ అంటే కూడా తనకు చాలా ఇష్టమని, ఆయన్ని చాలాసార్లు కలిసాను. ఒలంపిక్ మెడల్ గెలిచిన్నప్పుడు చిరంజీవి గారు ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి ఆహ్వానించి సత్కరించారని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. అది తాను ఎప్పటికి మర్చిపోలేనన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇష్టమైన హీరోల లిస్టు పెద్దగానే ఉందంటూ చెప్పుకొచ్చారు.
ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటన అంటే కూడా తనకు చాలా ఇష్టమని చెప్పిన బాడ్మింటన్ బ్యూటీ. కానీ, విజయ్ చేసిన కొన్ని సినిమాలు మాత్రం తనకు నచ్చలేదని, వాటి పేర్లు చెప్పలేనన్నారు. తనకు నచ్చనివి కొందరికి నచ్చొచ్చు కదా అంటూ .. అనవసరమైన కాంట్రవర్సీ అని ఫైనల్ గా ఆ హీరో గురించి ముగించారు. ఇకపోతే తాను నటిగా సినీ ఎంట్రీ ఇస్తున్నానంటూ వస్తోన్న వార్తలపై స్పందించిన సింధు.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వెల్లడించారు. ఒకవేళ ఫ్యూచర్ లో తన బయోపిక్ లాంటిది చేస్తే.. తన పాత్రలో దీపికా పదుకొనె అయితే బాగా సెట్ అవుతుందనుకుంటున్నానని చెప్పుకొచ్చారు సింధు. ప్రస్తుతం పీవీ సింధుకు సంబందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com