Rajasthan Royals : ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న రాజస్థాన్ రాయల్స్!

Rajasthan Royals : ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న రాజస్థాన్ రాయల్స్!

లక్నోపై ఢిల్లీ గెలవడంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. పేలవమైన రన్ రేట్ కారణంగా ఏదైనా అనుకోని అద్భుతం జరిగితే తప్ప.. ఢిల్లీ, లక్నో రెండూ కూడా ప్లే ఆఫ్స్ రేసులో నుంచి వైదొలగినట్లే. ఇక రేసులో ఉన్న 3 జట్లలో హైదరాబాద్‌ 18 పాయింట్లకు చేరుకునేందుకు ఛాన్స్ ఉంది. చెన్నై, ఆర్సీబీ రెండింటిలో ఏదో ఒక జట్టే ప్లే ఆఫ్స్‌కు వస్తుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ స్పాట్ ఖరారు చేసుకుంది.

రాజస్తాన్ 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 16 పాయింట్లతో నాకౌట్ బెర్త్‌ను దక్కించుకుంది. లక్నో ఈ మ్యాచ్‌‌లో నెగ్గి.. ఆఖరి మ్యాచ్‌లో ముంబైని కూడా ఓడిస్తే 16 పాయింట్లు సాధించేది. కానీ, ఢిల్లీ చేతిలో ఓడటంతో ఆ జట్టు ముంబైపై గెలిచినా గరిష్టంగా 14 పాయింట్లు పొందే అవకాశం మాత్రమే ఉంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న చెన్నయ్, హైదరాబాద్ మినహా మిగతా జట్లకు 16 పాయింట్లు పొందే చాన్స్ లేదు. దీంతో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్‌కు నాకౌట్ బెర్త్ ఖాయమైంది.

ప్లేఆఫ్స్ బెర్తుల కోసం నువ్వానేనా అన్నట్లు సాగుతున్న ఐపీఎల్ పోరులో నేడు ఓ నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ప్లేఆఫ్స్‌లో బెర్తు ఖరారు చేసుకున్న రాజస్థాన్ రాయల్స్, ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి టాప్2లో ఉండాలని రాజస్థాన్ భావిస్తుంటే.. టాప్ టీమ్‌ రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి అభిమానులకు అసలైన మజా ఇవ్వాలని పంజాబ్ చూస్తోంది.

Tags

Next Story