IPL 2024 : రాజస్థాన్ రాయల్స్ అరుదైన రికార్డ్ నమోదు

కేకేఆర్‌పై రాజస్థాన్ రాయల్స్ అరుదైన రికార్డ్ నమోదు చేసింది. బట్లర్ పుణ్యమా అని ఈ సీజన్‌లో అత్యధిక లక్ష్యాన్ని (224) ఛేదించిన జట్టుగా నిలిచింది. అయితే రాజస్థాన్ రాయల్స్ కు ఇంత భారీ స్కోర్‌ను ఛేజ్ చేయడం కొత్త కాదు. 2020లో పంజాబ్‌పై కూడా 224 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి సాధించింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే రెండుసార్లు భారీ టార్గెట్ (224)ను ఛేదించిన ఏకైక జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఉత్కంఠభరితమైన పోరులో కోల్‌కతాపై రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం సాధించింది. జోస్ బట్లర్ 107*(60) ధాటిగా ఆడటంతో రాజస్థాన్ 224 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం ఛేదించింది. రియాన్ పరాగ్ 34(14) మినహా టాప్, మిడిల్ ఆర్డర్‌లో బ్యాటర్లు ఎవరూ సరైన భాగస్వామ్యం అందించలేదు. కానీ బట్లర్ ఒంటరి పోరాటం చేసి మ్యాచ్ గెలిపించాడు. దీంతో కోల్‌కతాలో నరైన్ సెంచరీ వృథా అయింది.
మ్యాచ్ అనంతరం బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆత్మవిశ్వాసంతో ధోనీ, కోహ్లీ చివరివరకు ఉండి పోరాడతారని ఈ మ్యాచ్‌లో తానూ అదే చేశానని అన్నారు. నాకు గతంలో సంగక్కర కూడా ఇదే మాట చెప్పారు. చివరివరకు క్రీజులో ఉంటే ఏదో క్షణాన పరిస్థితులు మనకి అనుకూలించొచ్చని అన్నారు. పోరాడకుండా ప్రత్యర్థికి వికెట్ ఇచ్చేయడం కన్నా ఘోరమైంది మరొకటి లేదు అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com