500 Test Wickets : అరుదైన రికార్డు సృష్టించిన అశ్విన్

టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అరుదైన రికార్డు నెలకొల్పారు. టెస్టుల్లో 500 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్లో క్రాలీ వికెట్ తీసిన అశ్విన్ ఈ మైలురాయి అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొమ్మిదో బౌలర్, రెండో భారతీయ క్రికెటర్ నిలిచారు. భారత్ తరఫున అత్యధిక టెస్టు వికెట్ల రికార్డు అనిల్ కుంబ్లే (619) పేరిట ఉంది. అశ్విన్ 184 ఇన్నింగ్సుల్లో 500 వికెట్లు సాధించారు. అందులో 8 సార్లు 10వికెట్లు, 34 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశారు.ఈ లిస్ట్ లో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మరళీధరణ్ 800 వికెట్లతో టాప్లో ఉన్నాడు.
టెస్టు క్రికెట్‌లో 500 పైగా వికెట్లు తీసిన ఆటగాళ్లు వీరే..
ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) – 800 వికెట్లు
షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) – 708
జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్) – 696*
అనిల్ కుంబ్లే (భారత్) – 619
స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్) – 604
గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) – 563
కోర్ట్నీ ఆండ్రూ వాల్ష్ (వెస్టిండీస్) – 519
నాథన్ లయన్ (ఆస్ట్రేలియా) – 517*
రవిచంద్రన్ అశ్విన్ (భారత్) – 500*
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com