100 Test Matches : అశ్విన్ తో పాటుగా 100 టెస్టులు ఆడిన భారత క్రికెటర్లు వీళ్లే

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) 100వ టెస్టు మ్యాచు ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచుకు ముందు నిర్వహించిన కార్యక్రమంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా ప్రత్యేక క్యాప్ ను అశ్విన్ అందుకున్నారు. ఈ సందర్భంగా అశ్విన్ తో భార్య, పిల్లలు ఉండటం గమనార్హం. టీమ్ సభ్యులు లెజెండరీ స్పిన్నర్ కు అభినందనలు తెలిపారు.
కాగా భారత్ తరఫున ఈ ఘనత అందుకున్న 14వ ప్లేయర్ గా అశ్విన్ నిలిచారు. ఇప్పటి వరకు టీమ్ ఇండియా తరఫున సచిన్, సునీల్ గవాస్కర్, కపిల్దేవ్, వెంగ్సర్కార్, సెహ్వాగ్, లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, హర్భజన్, పుజార, కోహ్లి, ఇషాంత్, గంగూలీ, ద్రవిడ్ ఉన్నారు. మిస్టర్ కూల్ ధోనీ 99టెస్టులు ఆడారు.
ధర్మశాల వేదికగా జురుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రజిత్ పాటిదార్ స్ధానంలో పడిక్కల్‌కు చోటు దక్కింది. ఇంగ్లాండ్ 18 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 64 పరుగులు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com