Team India : రోహిత్‌లో ఆ రోజు గొప్ప నాయకుడిని చూశా : రవిచంద్రన్ అశ్విన్

తన తల్లికి సీరియస్‌గా ఉందని డాక్టర్ చెప్పగానే తాను నిల్చున్నచోటనే కుప్పకూలిపోయానని టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తెలిపారు. ‘ఆ వార్త తెలియగానే డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని ఏడుస్తూనే ఉన్నా. ఫ్లైట్ టికెట్ల కోసం మొబైల్‌లో వెతుకుతున్నా. ఇంతలో కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చి నన్ను ఓదార్చారు. నేను చెన్నై వెళ్లడానికి అప్పటికప్పుడు ఛార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు.
నేను విమానాశ్రయానికి వెళ్లేసరికి ఫిజియో కమలేశ్ నాకోసం సిద్ధంగా ఉన్నాడు. నాకు తోడుగా వెళ్లమని రోహితే అతడికి చెప్పాడు. నాతో పాటు పుజారా సైతం వచ్చాడు. ఆ సమయంలో నా వెంట ఎవరూ లేకుంటే చాలా కష్టమయ్యేది.రోహిత్‌లో ఆ రోజు గొప్ప నాయకుడిని చూశా ’ అని ఆయన పేర్కొన్నారు. తాను కెప్టెన్‌గా ఉన్నా కూడా ఓ ఆటగాడికి అంత అండగా నిలిచేవాడిని కాదేమో అని అతనన్నాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు మధ్యలో టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాజ్‌కోట్ నుంచి చెన్నైకి వెళ్లి వచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com