Cricket News : ఆర్ సీబీ గెలుపు .. స్మృతి మంధానకు కోహ్లీ వీడియో కాల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మహిళల జట్టు డ్యూపీఎల్ విజేతగా నిలిచింది. తొలిసారి ఈ జట్టు కప్పు కొట్టడంతో ఆర్సీబీ ఆటగాళ్లు, ఫ్యాన్స్, ఫ్రాంచైజీ ఫుల్ ఖుషీలో ఉన్నారు. కాగా ఆర్సీబీ గెలవగానే ఆ జట్టు పురుషుల కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధానకు (Smriti Mandana) వీడియో కాల్ చేసి అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుకు వ్యాపారవేత్త విజయ్ మాల్యా అభినందనలు తెలిపారు. ‘మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ పురుషుల జట్టు ట్రోఫీ గెలిస్తే అది అద్భుతమైన డబుల్ ధమాకా అవుతుంది. గుడ్ లక్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com